Versions
TEV ఒకడు చచ్చు నట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
ERVTE ఒక వ్యక్తి బండతో ఇంకో మనిషిని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ బండ సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించేది)
IRVTE ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.