Bible Versions
Bible Books

:

1 దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు... యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.
2 దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.
3 దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను.
4 మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదున కిచ్చెను.
5 దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధిగలిగి పని చేసికొని వచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అను కూలుడై యుండెను.
6 దావీదు ఫిలిష్తీయుని హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురల తోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి
7 స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుసౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.
8 మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను
9 కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.
10 మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగా1 దావీదు మునుపటిలాగున వీణచేత పట్టుకొని వాయించెను.
11 ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగాదావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించు కొనెను.
12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడై యుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను.
13 కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను.
14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగాయెహోవా అతనికి తోడుగా నుండెను.
15 దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను.
16 ఇశ్రాయేలు వారితోను యూదావారి తోను దావీదు జనులకు ముందువచ్చుచు, పోవుచునుండుటచేత వారు అతనిని ప్రేమింపగా
17 సౌలునా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొనిదావీదూ, నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధ శాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలె ననెను.
18 అందుకు దావీదురాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.
19 అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్య వలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను.
20 అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,
21 ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొనిఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి
22 తన సేవకులను పిలిపించిమీరు దావీదుతో రహస్యముగా మాటలాడిరాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
23 సౌలు సేవకులు మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదునేను దరిద్రుడనైయెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా
24 సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి.
25 అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడ నెను.
26 సౌలు సేవకులు మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై
27 గడువుదాటక మునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందల మందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.
28 యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి
29 దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్ల ప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.
30 ఫలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలు దేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివే కము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×