Versions
TEV మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కు నంతగా మీ ¸°వనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితయ్యేలా చేశాను. కాని మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
IRVTE నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు
మీ మీదికి తెగుళ్లు పంపాను.
మీ యువకులను కత్తితో చంపేశాను.
మీ గుర్రాలను తీసుకుపోయారు.
మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన
మీ ముక్కుల్లోకి ఎక్కింది.
అయినా మీరు నా వైపు తిరగలేదు.
యెహోవా ప్రకటించేది ఇదే.