Versions
TEV నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు?
ERVTE “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే, మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే, యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?