Versions
TEV ఖడ్గమును తప్పించుకొనినవారలారా, ఆలస్యముచేయక వెళ్లుడి, దూరమునుండి మీరు యెహోవాను జ్ఞాపకముచేసికొనుడి యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియ్యుడి.
ERVTE కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి; బబులోనును వదిలిపొండి. ఆగకండి! మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు. కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసికొనండి.