Versions
TEV ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి
ERVTE పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి.
IRVTE “ఈ ఆలోచన మీ దృష్టిలో అనుకూలంగా ఉంటే, ఇది మన దేవుడైన యెహోవా వలన కలిగినదే ఐతే, ఇశ్రాయేలీయుల నివాసప్రదేశాలన్నిట్లో మిగిలి ఉన్న మన సహోదరులు తమ పట్టణాల్లో, పల్లెల్లో కాపురం ఉన్న యాజకులు, లేవీయులు, మనతో కలిసేలా వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి,