Versions
TEV అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్య మైనను లేని లేవీ యులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనముచేసి తృప్తిపొందుదురు.
ERVTE లేవీయులకు వారి స్వంత భూమి లేదు గనుక ఈ ఆహారం వారికోసం ఉంటుంది. మీ పట్టణంలో భోజనం లేని వారికి, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు కూడా ఈ భోజనం ఉంటుంది. ఇలా గనుక మీరు చేస్తే మీరు చేసే ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.