Versions
TEV నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడియైన ఆహారద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై యుండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబీళ్లలో మేయును.
ERVTE ఆ కాలంలో యెహోవా మీకు వర్షం పంపిస్తాడు. భూమిలో మీరు విత్తనాలు నాటుతారు, భూమి మీకు పంట పండిస్తుంది. మీకు విస్తారమైన పంట లభిస్తుంది. మీ పశువులకు మీ పొలాల్లో విస్తారమైన మేత ఉంటుంది. మీ గొర్రెలకు విశాలమైన బీళ్లు ఉంటాయి.