Versions
TEV బెన్యామీనీయులు మునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరి గాని ఇశ్రాయేలీయులుమనము పారిపోయి వారిని పట్ట ణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.
ERVTE “పూర్వంలా మనం జయిస్తున్నాము” అని బెన్యామీను మనుష్యులు అనుకున్నారు. ఇశ్రాయేలు మనుష్యులు పరుగు పెట్టుచున్నారు. కాని అదొక యుక్తి బెన్యామీను మనుష్యులు తమ నగరమునుండి రాజమార్గం మీదికి రావాలని వారు అభిలాషించారు.