Versions
TEV ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపిసౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.
ERVTE సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకుని వాటిని నరికి ముక్కలు చేసి, వాటని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి వాటిని ఇశ్రాయేలునలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. “వార్తహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.” యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు.
IRVTE ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ “సౌలు, సమూయేలులతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను” అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరకి వచ్చారు.