Versions
TEV దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమో రీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
ERVTE “కాని అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయిన వారు. వారు సింధూర వృక్షమంత బలంగల వారు. కాని, పైన వాటి పండ్లును, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.