Versions
TEV నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.
ERVTE నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనేవుంది. నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను “నా ప్రియ సఖీ, ప్రేయసీ నా గువ్వపిట్టా, సుగుణ ఖనీ! నా తల మంచుతో తడిసింది నా జుట్టు రేమంచు జడికి నానింది.”
IRVTE {విరహ వేదన} PS నాలుగవ భాగం (యువతి మాట్లాడుతూ ఉంది)
నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది.
నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి.
నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.” PEPS