Versions
TEV లేవీయుల పట్టణముల యిండ్లు ఇశ్రాయేలీయుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించిన యెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.
ERVTE ఒక వ్యక్తి ఒక లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, లేవీయుల పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేతనంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలే లేవీయులకు ఇచ్చారు.
IRVTE లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న ఆ లేవీయుల ఆస్తి గనక ఎవరైనా లేవీయుల దగ్గర ఇల్లు కొనుక్కున్నారనుకోండి. అది లేవీయులకు పిత్రార్జితంగా వచ్చిన పట్టణంలో అమ్మిన ఇల్లు. అది సునాద సంవత్సరంలో విడుదల అవుతుంది.