Versions
TEV రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను.
ERVTE “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు వద్దకు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు.
IRVTE రాత్రి కలిగిన దర్శనాలను నేనింకా చూస్తుండగా,
ఆకాశ మేఘాలపై వస్తున్న మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చాడు.
ఆ మహా వృద్ధుని సన్నిధిలో ప్రవేశించాడు.
ఆయన సముఖానికి అతణ్ణి తీసుకు వచ్చారు.