Versions
TEV లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుఱ్ఱములను కట్టుడి; ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమకారణముగా ఉండును.
ERVTE లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ, రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు. సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి. ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు.
IRVTE లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి.
ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి.
నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం.