Bible Versions
Bible Books

Nehemiah 13:19 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని.
ERVTE   అందుకని, నేనేమి చేశానంటే: ప్రతి శుక్రవారము సాయంత్రము (విశ్రాంతి దినానికి ముందు) చీకటి పడేందుకు సరిగ్గా ముందు, యెరూషలేము ద్వారాలను మూసేసి, తాళాలు బిగించమని ద్వార పాలకులను నేను ఆదేశీంచాను. తలుపులను సబ్బాతు రోజు ముగిసేదాకా తియ్యరాదు. ద్వారాల దగ్గర నా సొంత మనుషుల్లో కొందర్ని పెట్టాను. సబ్బాతు రోజున యెరూషలేము నగరంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ ఎలాంటి సరుకుల మూటలూ రాకుండా చూడమని నేను వాళ్లని కట్టడిచేశాను.
IRVTE   విశ్రాంతి దినానికి ముందు రోజు చీకటి పడినప్పుడు యెరూషలేం ద్వారాలు మూసి ఉంచాలనీ, విశ్రాంతి దినం ముగిసేదాకా తలుపులు తియ్యకూడదనీ ఆజ్ఞాపించాను. విశ్రాంతి దినాన ఎలాంటి బరువులు లోపలికి రాకుండేలా తలుపుల దగ్గర నా పనివాళ్ళలో కొందరిని కాపలా ఉంచాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us