Versions
TEV ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పద ముగా నుండును.
ERVTE ఆ స్త్రీ తన భర్తకు వ్యతిరేకంగా పాపం గనుక చేసి ఉంటే, ఆ నీళ్లు ఆమెకు హాని కలిగిస్తాయి. ఆ నీళ్లు ఆమె శరీరంలోనికి పోయి, ఆమెకు చాలా శ్రమ కలిగిస్తాయి. ఆమెలో ఏదైనా శిశువు ఉంటే అది పుట్టక ముందే మరణిస్తుంది, ఆమె ఎన్నటికీ పిల్లలను కనదు. ప్రజలంతా ఆమెకు వ్యతిరేకం అవుతారు.
IRVTE యాజకుడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించినప్పుడు ఒకవేళ ఆమె అపవిత్రురాలై తన భర్తకి ద్రోహం చేసి ఉంటే శాపం కలుగజేసే ఆ నీళ్ళు ఆమె కడుపులోకి వెళ్ళి చేదు అవుతాయి. ఆమె పొత్తి కడుపు వాచి ఉబ్బుతుంది. ఆమె తొడలు బలహీనం అవుతాయి. ఆమె తన ప్రజల్లో శాపగ్రస్తురాలవుతుంది.