Versions
TEV యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.
ERVTE యెహవా, నీవేనాకు బలం; నీవే నాకు రక్షణ. ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు. ప్రపంచ దేశాలన్నీనీ శరణు వేడివస్తాయి. ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు. వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేదు.”
IRVTE యెహోవా, నువ్వే నా బలం. నా దుర్గం. దురవస్థలో ఆశ్రయంగా ఉన్నావు. ప్రపంచమంతటి నుంచి రాజ్యాలు నీ దగ్గరికి వచ్చి “మా పూర్వీకులు, వ్యర్ధాన్ని * వ్యర్ధాన్ని నీచమైన విగ్రహాలు స్వతంత్రించుకున్నారు. అవి వట్టివి విగ్రహాలు. అవి పనికిమాలినవి” అని చెబుతారు.