Versions
TEV మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను కొండలనుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు.
ERVTE కొండమీద నుండి నేను ఆ ప్రజలను చూస్తున్నాను. ఎత్తయిన కొండల నుండి నేను చూస్తున్నాను. ఒంటరిగా బతుకుతున్న ప్రజలను నేను చూస్తున్నాను, వాళ్లు మరో జనములో భాగంకారు యాకోబు ప్రజలను ఎవరు లెక్కించగలరు.
IRVTE రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను.
కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను.
చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది.
వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.