Versions
TEV ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను, వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొంద వలెను.
ERVTE అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి.
IRVTE అయితే ఆ ఎద్దు ఇతరులను పొడుస్తుంది అని ఇంతకు ముందు దాని యజమానికి తెలిసి కూడా అతడు దాన్ని అదుపు చేయక పోవడం వల్ల దాని ద్వారా పురుషుడు గానీ, స్త్రీ గానీ చనిపోతే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు దాని యజమానికి మరణశిక్ష విధించాలి.