Versions
TEV వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.
ERVTE వారి సైన్యాలకు ధనుస్సులు, ఈటెలు ఉన్నాయి. ఆ సైనికులు బహు క్రూరులు వారికి దయలేదు. గుర్రాలపై స్వారి చేస్తూ సైనికులు వస్తారు. అప్పుడు సముద్ర ఘోషలా శబ్దంపుడుతుంది. వారివారి స్థానాలలో యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు! బబులోను నగరమా, నీపై దాడికి వారు సిద్ధంగా వున్నారు.
IRVTE వాళ్ళు వింటినీ, బల్లేలనూ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు క్రూరులు. వాళ్ళలో కనికరం లేదు.
వాళ్ళ స్వరం సముద్రపు ఘోషలా ఉంది. బబులోను కుమారీ, వాళ్ళు యుద్ధ వీరుల్లా బారులు తీరి తమ గుర్రాలపై వస్తున్నారు.