Bible Versions
Bible Books

Jeremiah 50:9 (WEB) World English Bible

Versions

TEV   ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
ERVTE   ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను. దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది. రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి. యుద్ధం నుండి వట్టి చేతులతో తిరిగిరాని సైనికుల్లా బాణాలు వుంటాయి.
IRVTE   ఎందుకంటే చూడండి, నేను బబులోనుకు విరోధంగా ఉత్తర దిక్కునుండి కొన్ని గొప్ప దేశాల సముదాయాన్ని రేపుతున్నాను.
వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. బబులోనును వాళ్ళు పట్టుకుంటారు.
వాళ్ళ బాణాలు నైపుణ్యం కల్గిన వీర యోధుల్లా ఉన్నాయి. అవి వ్యర్ధంగా తిరిగి రావు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us