Versions
TEV ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.
ERVTE అది ఒక చీకటిదుర్దినంగా ఉంటుంది. అది అంధకారపు మేఘాలు కమ్మిన దినంగా ఉంటుంది. సూర్యోదయాన సైన్యం పర్వతాలలో నిండి ఉండటం నీవు చూస్తావు. అది మహశక్తిగల సైన్యంగా ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటిది ఏదీ, ఎన్నడూ ఉండలేదు. మరియు ఇలాంటిది ఏది, ఎన్నటికీ మరో సారి ఉండదు.
IRVTE అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు.
కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు.
పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు
బలమైన గొప్ప సేన వస్తూ ఉంది.
అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు.
తరతరాల తరువాత కూడా అది ఉండదు. PEPS