Versions
TEV సీసెరా తల్లి కిటికీలోనుండి చూచెను అల్లిక కిటికీలోనుండి చూచి కేకలు వేసెను రాక, అతని రథము తడవుచేయ నేల? అతని రథముల చక్రములు ఆలస్యముచేయ నేల?
ERVTE సీసెరా తల్లి కిటికీలోంచి చూసి ఏడుస్తు వున్నది. సీసెరా తల్లి తెరలలో నుండి చూస్తు వున్నది, ‘సీసెరా రథం ఎందుకు ఆలస్యమైంది? అతని రథం, గుర్రాల ధ్వనులు ఎందుకు ఆలస్యం అయ్యాయి.