Versions
TEV ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను.
ERVTE యెహోవా, గతంలో నీవు శేయీరు దేశం నుండి వచ్చావు. ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు. నీవు నడువగా భూమి కంపించింది. ఆకాశాలు వర్షించాయి. మేఘాలు నీళ్లు కురిపించాయి.