Versions
TEV నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి వారిని తోలి వేసినతరువాతనేను ఈ దేశమును స్వాధీన పరచుకొనునట్లుగా యెహోవా నా నీతినిబట్టి నన్ను ప్రవేశ పెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమునుబట్టియే యెహోవా నీ యెదుట నుండి వారిని వెళ్లగొట్టుచున్నాడు.
ERVTE “ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే.