Versions
TEV బహుజనులఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు
ERVTE “కొండల్లో పెద్ద శబ్దం అవుతోంది. ఆ శబ్దం వినండి! అది విస్తారమైన ప్రజల శబ్దంలా ఉంది. అనేక రాజ్యాల ప్రజలు కూడుకొంటున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా తన సైన్యాలను ఒక్కటిగా చేరుస్తున్నాడు.