Versions
TEV వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయు చున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
ERVTE అయితే ఆ మనుష్యులు కనీసం వాళ్లనే వాళ్లు రక్షించుకోలేరు. వాళ్లు గడ్డిలా కాలిపోతారు. వాళ్లు త్వరగా కాలిపోయినందుచేత రొట్టె కాల్చుకొనేందుకు గూడ నిప్పులు మిగులవు. వెచ్చగా కాచుకొనేందుకు మంటగూడా మిగలదు.
IRVTE వారు చెత్త పరకల్లాగా అవుతారు. అగ్ని వారిని కాల్చివేస్తుంది.
అగ్ని జ్వాలల నుండి తమను తామే రక్షించుకోలేకపోతున్నారు.
అది చలి కాచుకొనే మంట కాదు, మనుషులు దాని ఎదుట కూర్చోగలిగింది కాదు.