Versions
TEV ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును.
ERVTE ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను. ఈ దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది. ఆ రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి. యుద్ధం నుండి వట్టి చేతులతో తిరిగిరాని సైనికుల్లా ఈ బాణాలు వుంటాయి.