Versions
TEV సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)
ERVTE నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు. లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము. ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.