Versions
TEV ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవు చున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.
ERVTE ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతి కివున్న వాటికి అతడు గ్రాసం ఇవ్వలేడు. ఆరోగ్యంగావున్నవి వూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలి వేయబడతాయి.”