Versions
TEV యెహోవా వాక్కు ఇదేఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులనుగూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి.
ERVTE ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది.
IRVTE యెహోవా వాక్కు ఇదే. “చూడు! ఇశ్రాయేలు, యూదా ప్రజలకు నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చే రోజులు వస్తున్నాయి.