Versions
TEV మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
ERVTE మీ వస్త్రాలు కాదు మీ హృదయాలు చింపుకోండి .” మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి. ఆయన దయ, జాలిగలవాడు. ఆయన త్వరగా కోపపడడు. ఆయనకు ఎంతో ప్రేమఉంది. ఒక వేళ ఆయన తలపెట్టిన చెడ్డ శిక్ష విషయంలో ఆయన తన మనస్సు మార్చుకొంటాడేమో.
IRVTE మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.
త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.
శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.
కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక
మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. PEPS