Versions
TEV సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొనిదేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.
ERVTE సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చువా?’ అని అడుగుతారు.”‘
IRVTE సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో వివిధ భాషలు మాట్లాడే అన్యప్రజల్లో పదేసిమంది ఒక యూదుడి చెంగు పట్టుకుని “దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడింది గనక మేము మీతో కూడా వస్తాము” అని చెబుతారు. PE