Bible Versions
Bible Books

8
:

1 సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన ఒక వర్తమానం ఇది.
2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం పచ్చింది.”
3 యెహోవా చెవుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబ డుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”
4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు.
5 వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది.
6 చావగా మిగిలిన వారు ఇదంతా అద్భుతం అనుకుంటారు నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను.
8 వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”
9 సర్వశక్తీమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు.
10 అంతకు ముందు, పనివారిని వెట్టటానికి, జంతువులను బాడుగకు తీసు కోటానికి మనుష్యుల వద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను.
11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్న వారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు.
12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను.
13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”
14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు.
15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చు కున్నాను. అదేమాదిరి నేను యెరూషలేము పట్ల, యూదాప్రజల పట్ల మంచిగా వుండటానికి నిర్ణయించు కున్నాను. కావున భయపడవద్దు!
16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్త్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి.
17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయ కండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటం పట్ల ఆసక్తి కన్పరచకండి. ఎందు కంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా విషయాలు చెప్పాడు.
18 నేనీ వర్త మానం సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి అందు కున్నాను.
19 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు,ఉపవాస దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ నెలలోను, పదవ నెలలోను కలిగి ఉన్నారు. సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన, సంతోష దాయకమైన విశ్రాంతి దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి!”
20 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుకున్నాడు, “భవిష్యత్తులో అనేక నగరాల నుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
21 ఒక నగరం నుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు, వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు. ‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము. మాతో రండి!’ ”
22 అనేక బలమైన రాజ్యాల నుండి అనేక మంది ప్రజలు సర్యశక్తిమంతుడైన యెహోవాను వెదుక్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి వస్తారు.
23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చువా?’ అని అడుగుతారు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×