Bible Versions
Bible Books

Micah 7 (ERVTE) Easy to Read Version - Telugu

1 నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను. పండిపోయినా ద్రాక్షాపండ్లవలె ఉన్నాను. తినటానికి ద్రాక్షాపండ్లు మిగలలేదు. నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లులేనేలేవు.
2 అనగా విశ్వసంగల జనులంతా పోయారు. దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు. ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు. ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటో పాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు.
3 ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.
4 వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు. వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లుపొదకంటే చాలా కంటకుడై ఉంటాడు. నీ ప్రవక్తలు రోజు వస్తుందని చెప్పారు. నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది. ఇప్పుడు నీవు శిక్షింపబడతావు! ఇప్పుడు నీవు కలవరపడతావు!
5 నీ పొరుగువానిని నమ్మవద్దు! స్నేహితుని నమ్మువద్దు! నీ భార్యతో సహితం నీవు స్వేచ్చగా మాట్లాడవద్దు!
6 తన ఇంటివారే తనకు శత్రువులవుతారు. ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు. ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది. ఒక కోడలు తన అత్తపై తిరుగుబడుతుంది.
7 కావున సహాయంకొరుకు నేను యెహోవా తట్టు చూస్తాను. నాకు సహాయం చేయటానికి నేను యెహోవా కొరకు నిరీక్షిస్తాను. నా దేవుడు నా మొర ఆలకిస్తాడు.
8 నేను పతనమయ్యాను. కానీ, శత్రువూ, నన్ను చూచి నవ్వకు! నేను తిరిగి లేస్తాను. నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను. కానీ యెహోవాయే నాకు వెలుగు.
9 This verse may not be a part of this translation
10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నుడిగింది. సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను. వీధిలో మట్టమీద నడిచి నట్లు జనులు ఆమెమీద నడుస్తారు.
11 నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది. సమయంలో వారి దేశం విస్తరిస్తుంది.
12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు. అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు. నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు, పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది.
13 దేశం పాడై పోయింది. దానిలో నివసించే జనులవల్ల, వారు చేసిన పనులవల్ల అది పాడై పోయింది.
14 కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు. నీకు చెందిన ప్రజా సమూహాన్ని పాలించు. మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు, పర్వతం మీదనూ ఒంటరిగానూ ఉంటుంది. గతంలో మాదిరి మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది.
15 నేను నిన్ను ఈజిప్టు నుండిబయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను. రకంగా మీరింకా ఎన్నో అద్భుత కార్యాలు చూసేలా చేస్తాను.
16 అన్య జనులు అద్భుతకార్యాలు చూసి సిగ్గుపడతారు. వారి “శక్తి” నాదానితో పోల్చినప్పుడు వ్యర్థమైనదని వారు గ్రహిస్తారు. వారు విస్మయం చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు! వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు.
17 వారు పాములా మట్టిలో పాకుతారు. వారు భయంతో వణుకుతారు. తమ బొరియల్లోనుంచి బయటకు వచ్చే కీటకాలవలె, వారు నేలమీద పాకుతారు. వారు భయపడి దేవుడైన యెహోవా వద్దకు వస్తారు. నీ ముందు వారు భయపడతారు!
18 నీవంటి దేవుడు మరొకడు లేడు. పాపం చేసిన దోషులను నీవు క్షమిస్తావు. నీ ప్రజలలో మిగిలిన వారి పాపాల వైపు నీవు చూడవు. దేవుడైన యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు.
19 యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు. మా పాపాలన్నిటినీ లోతైన సముద్రంలోకి విసిరివేయుము.
20 దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు. అబ్రాహాము యెడల దయకలిగి యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×