|
|
1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
|
1. To the chief Musician H5329 , A Psalm H4210 of David H1732 . Blessed H835 is he that considereth H7919 H413 the poor H1800 : the LORD H3068 will deliver H4422 him in time H3117 of trouble H7451 .
|
2. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
|
2. The LORD H3068 will preserve H8104 him , and keep him alive H2421 ; and he shall be blessed H833 upon the earth H776 : and thou wilt not H408 deliver H5414 him unto the will H5315 of his enemies H341 .
|
3. రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
|
3. The LORD H3068 will strengthen H5582 him upon H5921 the bed H6210 of languishing H1741 : thou wilt make H2015 all H3605 his bed H4904 in his sickness H2483 .
|
4. యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
|
4. I H589 said H559 , LORD H3068 , be merciful H2603 unto me: heal H7495 my soul H5315 ; for H3588 I have sinned H2398 against thee.
|
5. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
|
5. Mine enemies H341 speak H559 evil H7451 of me, When H4970 shall he die H4191 , and his name H8034 perish H6 ?
|
6. ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
|
6. And if H518 he come H935 to see H7200 me , he speaketh H1696 vanity H7723 : his heart H3820 gathereth H6908 iniquity H205 to itself; when he goeth H3318 abroad H2351 , he telleth H1696 it .
|
7. నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.
|
7. All H3605 that hate H8130 me whisper H3907 together H3162 against H5921 me: against H5921 me do they devise H2803 my hurt H7451 .
|
8. కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
|
8. An evil H1100 disease H1697 , say they , cleaveth fast H3332 unto him : and now that H834 he lieth H7901 he shall rise up H6965 no H3808 more H3254 .
|
9. నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
|
9. Yea H1571 , mine own familiar friend H7965 H376 , in whom H834 I trusted H982 , which did eat H398 of my bread H3899 , hath lifted up H1431 his heel H6119 against H5921 me.
|
10. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.
|
10. But thou H859 , O LORD H3068 , be merciful H2603 unto me , and raise me up H6965 , that I may requite H7999 them.
|
11. నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
|
11. By this H2063 I know H3045 that H3588 thou favorest H2654 me, because H3588 mine enemy H341 doth not H3808 triumph H7321 over H5921 me.
|
12. నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
|
12. And as for me H589 , thou upholdest H8551 me in mine integrity H8537 , and settest H5324 me before thy face H6440 forever H5769 .
|
13. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్. ఆమేన్.
|
13. Blessed H1288 be the LORD H3068 God H430 of Israel H3478 from everlasting H4480 H5769 , and to H5704 everlasting H5769 . Amen H543 , and Amen H543 .
|