Bible Versions
Bible Books

Zechariah 14 (ERVTE) Easy to Read Version - Telugu

1 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుండి.
2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టు కొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని మిగిలిన ప్రజలు నగరం నుండి తీసుకుపోబడరు.
3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది.
4 సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున పున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీ లి పోతుంది. కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పు నుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది.
5 పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం పచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయన యొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.
6 This verse may not be a part of this translation
7 This verse may not be a part of this translation
8 సమయంలో యెరూషలేము నుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రం వైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడపునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది.
9 సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే.
10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంత మంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగలు వరకు మళ్లీ నిర్మింప బడుతుంది.
11 నిషేధం తొలగింప బడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది.
12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది.
13 This verse may not be a part of this translation
14 This verse may not be a part of this translation
15 This verse may not be a part of this translation
16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన వారిలో కొంత మంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు.
17 భూమి మీద వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళక పోయి నట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు.
18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి వంశంవారైనా పర్ణశాలల వండుగ జరువు కొనుటకురాక పోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు.
19 వర్ణశాలల పండుగ జరుపుకొనుటకు రానటువంటి ఈజిప్టుకు, మరి ఇతర దేశానికైనా అదే శిక్ష.
20 సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాల మీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠం వద్ద పుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాము ఖ్యంగల వస్తువులే.
21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలో గల ప్రతి ప్రాత్రమీద “సర్వశక్రిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని ప్రానిన చీటి అంట బెట్టబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు. సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయ విక్రయాలు జరిపే వ్యాపారస్తులెప్వరూ వుండరు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×