Bible Versions
Bible Books

:
-

1 యెహోవాను స్తుతించండి! యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి! యెహోవా నామాన్ని స్తుతించండి.
2 ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
3 తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి, సూర్యుడు అస్తమించే స్థలం వరుకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
4 యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు. ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
5 మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు. దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
6 ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి.
7 దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు. భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
8 మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు. మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
9 ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×