Bible Versions
Bible Books

:
-

1 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు. ఇశ్రాయేలూ, శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ వారు ఎన్నడూ జయించలేదు.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు.
6 మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు. గడ్డి ఎదుగక ముందే చస్తుంది.
7 పని వానికి గడ్డి గుప్పెడు కూడా దొరకద. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
8 దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.” “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×